Isaiah

యెషయా 4

6 వచనాలు 66 అధ్యాయాలలో 4
యెషయా 4 — ఆడియో
అధ్యాయం 4 / 66
యెషయా 4 6 వచనాలు
1

ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు.

2

ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును.

3

సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

4

తీర్పుతీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సీయోను కూమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్యనుండి తీసివేసి దాని శుద్ధిచేయునప్పుడు

5

సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.

6

మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.

అధ్యాయం 3 అన్ని అధ్యాయాలు అధ్యాయం 5
క్రాస్ రిఫరెన్సులు