Proverbs

సామెతలు 20

30 వచనాలు 31 అధ్యాయాలలో 20
సామెతలు 20 — ఆడియో
అధ్యాయం 20 / 31
సామెతలు 20 30 వచనాలు
1

ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానము లేనివారు.

2

రాజువలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు

3

కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.

4

విత్తులువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

5

నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును.

6

దయచూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

7

యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.

8

న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.

9

నా హృదయమును శుద్ధపరచుకొనియున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?

10

వేరు వేరు తూనికె రాళ్లు వేరు వేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.

11

బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.

12

వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.

13

లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొని యుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.

14

కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును.

15

బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

16

అన్యునికొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరులకొరకు వానినే కుదువ పెట్టించుము

17

మోసముచేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.

18

ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.

19

కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.

20

తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.

21

మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.

22

కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.

23

వేరు వేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.

24

ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొనగలడు?

25

వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును.

26

జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.

27

నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.

28

కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును.

29

యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము

30

గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును.

అధ్యాయం 19 అన్ని అధ్యాయాలు అధ్యాయం 21
క్రాస్ రిఫరెన్సులు