1దినవృత్తాంతములు 8
బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,
మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.
బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
అబీషూవ నయమాను అహోయహు
గెరా షెపూపాను హూరాము
ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటిపెద్దలుగా నుండిరి;
నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొనిపోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొనిపోయెను.
వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక
తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
అహ్యోషాషకు యెరేమోతు
జెబద్యా అరాదు ఏదెరు
మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.
జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు
ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.
యాకీము జిఖ్రీ జిబ్ది
ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.
అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు.
ఇష్పాను ఏబెరు ఎలీయేలు
అబ్దోను జిఖ్రీ హానాను
హనన్యా ఏలాము అంతోతీయా
ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.
షంషెరై షెహర్యా అతల్యా
యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.
వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునైయుండి యెరూషలేమునందు కాపురముండిరి.
గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్యపేరు మయకా;
ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
గెదోరు అహ్యో జెకెరు అనువారు.
మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి.
నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.
ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.
ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.
అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవవాడు.
ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారులును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యామీనీయులు.