Psalms

కీర్తనలు 100

5 వచనాలు 150 అధ్యాయాలలో 100
కీర్తనలు 100 — ఆడియో
అధ్యాయం 100 / 150
కీర్తనలు 100 5 వచనాలు
1

సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.

2

సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.

3

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.

4

కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.

5

యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును.

అధ్యాయం 99 అన్ని అధ్యాయాలు అధ్యాయం 101
క్రాస్ రిఫరెన్సులు