Psalms

కీర్తనలు 15

5 వచనాలు 150 అధ్యాయాలలో 15
కీర్తనలు 15 — ఆడియో
అధ్యాయం 15 / 150
కీర్తనలు 15 5 వచనాలు
1

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?

2

యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.

3

అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువానిమీద నింద మోపడు

4

అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.

5

తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

అధ్యాయం 14 అన్ని అధ్యాయాలు అధ్యాయం 16
క్రాస్ రిఫరెన్సులు