Psalms

కీర్తనలు 52

9 వచనాలు 150 అధ్యాయాలలో 52
కీర్తనలు 52 — ఆడియో
అధ్యాయం 52 / 150
కీర్తనలు 52 9 వచనాలు
1

శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.

2

మోసము చేయువాడా, వాడిగల మంగలకత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించుచున్నది

3

మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె అబద్ధము చెప్పుటయు నీకిష్టము.(సెలా.)

4

కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

5

కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)

6

నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి

7

ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమ్మికయుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు.

8

నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను

9

నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.

అధ్యాయం 51 అన్ని అధ్యాయాలు అధ్యాయం 53
క్రాస్ రిఫరెన్సులు