Psalms

కీర్తనలు 122

9 వచనాలు 150 అధ్యాయాలలో 122
కీర్తనలు 122 — ఆడియో
అధ్యాయం 122 / 150
కీర్తనలు 122 9 వచనాలు
1

యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.

2

యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి

3

యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు

4

ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమునుబట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.

5

అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడియున్నవి.

6

యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.

7

నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.

8

నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.

9

మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.

అధ్యాయం 121 అన్ని అధ్యాయాలు అధ్యాయం 123
క్రాస్ రిఫరెన్సులు