Psalms

కీర్తనలు 108

13 వచనాలు 150 అధ్యాయాలలో 108
కీర్తనలు 108 — ఆడియో
అధ్యాయం 108 / 150
కీర్తనలు 108 13 వచనాలు
1

దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానము చేయును.

2

స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను

3

జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను

4

యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది.

5

దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము.

6

నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము.

7

తన పరిశుద్ధత తోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.

8

గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము.

9

మోయాబు నేను కాళ్లు కడగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను.

10

కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొనిపోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును?

11

దేవా, నీవు మమ్మును విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మానియున్నావు గదా?

12

మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము

13

దేవునివలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.

అధ్యాయం 107 అన్ని అధ్యాయాలు అధ్యాయం 109
క్రాస్ రిఫరెన్సులు