Psalms

కీర్తనలు 70

5 వచనాలు 150 అధ్యాయాలలో 70
కీర్తనలు 70 — ఆడియో
అధ్యాయం 70 / 150
కీర్తనలు 70 5 వచనాలు
1

దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.

2

నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.

3

ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందుదురుగాక

4

నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.

5

నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ.

అధ్యాయం 69 అన్ని అధ్యాయాలు అధ్యాయం 71
క్రాస్ రిఫరెన్సులు