Psalms

కీర్తనలు 23

6 వచనాలు 150 అధ్యాయాలలో 23
కీర్తనలు 23 — ఆడియో
అధ్యాయం 23 / 150
కీర్తనలు 23 6 వచనాలు
1

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

2

పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.

3

నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.

4

గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

5

నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.

6

నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.

అధ్యాయం 22 అన్ని అధ్యాయాలు అధ్యాయం 24
క్రాస్ రిఫరెన్సులు