Psalms

కీర్తనలు 93

5 వచనాలు 150 అధ్యాయాలలో 93
కీర్తనలు 93 — ఆడియో
అధ్యాయం 93 / 150
కీర్తనలు 93 5 వచనాలు
1

యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.

2

పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే

3

వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి

4

విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు

5

నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము.

అధ్యాయం 92 అన్ని అధ్యాయాలు అధ్యాయం 94
క్రాస్ రిఫరెన్సులు