Psalms

కీర్తనలు 110

7 వచనాలు 150 అధ్యాయాలలో 110
కీర్తనలు 110 — ఆడియో
అధ్యాయం 110 / 150
కీర్తనలు 110 7 వచనాలు
1

ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

2

యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.

3

యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములోనుండి నీయొద్దకు వచ్చెదరు

4

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

5

ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.

6

అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాల దేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.

7

మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.

అధ్యాయం 109 అన్ని అధ్యాయాలు అధ్యాయం 111
క్రాస్ రిఫరెన్సులు