Psalms

కీర్తనలు 99

9 వచనాలు 150 అధ్యాయాలలో 99
కీర్తనలు 99 — ఆడియో
అధ్యాయం 99 / 150
కీర్తనలు 99 9 వచనాలు
1

యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడైయున్నాడు భూమి కదలును.

2

సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.

3

భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు.

4

యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.

5

మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.

6

ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.

7

మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి

8

యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివి వారిక్రియలనుబట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి.

9

మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి.

అధ్యాయం 98 అన్ని అధ్యాయాలు అధ్యాయం 100
క్రాస్ రిఫరెన్సులు