Psalms

కీర్తనలు 128

6 వచనాలు 150 అధ్యాయాలలో 128
కీర్తనలు 128 — ఆడియో
అధ్యాయం 128 / 150
కీర్తనలు 128 6 వచనాలు
1

యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

2

నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.

3

నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.

4

యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును.

5

సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు

6

నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.

అధ్యాయం 127 అన్ని అధ్యాయాలు అధ్యాయం 129
క్రాస్ రిఫరెన్సులు