Psalms

కీర్తనలు 61

8 వచనాలు 150 అధ్యాయాలలో 61
కీర్తనలు 61 — ఆడియో
అధ్యాయం 61 / 150
కీర్తనలు 61 8 వచనాలు
1

దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము

2

నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత యెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము.

3

నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి

4

యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కలచాటున దాగుకొందును (సెలా.)

5

దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించియున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించియున్నావు.

6

రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక.

7

దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము.

8

దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.

అధ్యాయం 60 అన్ని అధ్యాయాలు అధ్యాయం 62
క్రాస్ రిఫరెన్సులు