Psalms

కీర్తనలు 76

12 వచనాలు 150 అధ్యాయాలలో 76
కీర్తనలు 76 — ఆడియో
అధ్యాయం 76 / 150
కీర్తనలు 76 12 వచనాలు
1

యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.

2

షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.

3

అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.)

4

దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సు గలవాడవు.

5

కఠినహృదయులు దోచుకొనబడియున్నారు వారు నిద్రనొందియున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.

6

యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.

7

నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?

8

నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి

9

దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.(సెలా.)

10

నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు.

11

మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.

12

అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.

అధ్యాయం 75 అన్ని అధ్యాయాలు అధ్యాయం 77
క్రాస్ రిఫరెన్సులు