Psalms

కీర్తనలు 113

9 వచనాలు 150 అధ్యాయాలలో 113
కీర్తనలు 113 — ఆడియో
అధ్యాయం 113 / 150
కీర్తనలు 113 9 వచనాలు
1

యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.

2

ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.

3

సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినొందదగినది.

4

యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశవిశాలమున వ్యాపించియున్నది

5

ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు?

6

ఆయన భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు.

7

ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై

8

ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు

9

ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

అధ్యాయం 112 అన్ని అధ్యాయాలు అధ్యాయం 114
క్రాస్ రిఫరెన్సులు