Psalms

కీర్తనలు 120

7 వచనాలు 150 అధ్యాయాలలో 120
కీర్తనలు 120 — ఆడియో
అధ్యాయం 120 / 150
కీర్తనలు 120 7 వచనాలు
1

నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.

2

యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.

3

మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?

4

తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును

5

అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.

6

కలహప్రియునియొద్ద నేను చిరకాలము నివసించినవాడను.

7

నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.

అధ్యాయం 119 అన్ని అధ్యాయాలు అధ్యాయం 121
క్రాస్ రిఫరెన్సులు