Psalms

కీర్తనలు 130

8 వచనాలు 150 అధ్యాయాలలో 130
కీర్తనలు 130 — ఆడియో
అధ్యాయం 130 / 150
కీర్తనలు 130 8 వచనాలు
1

యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.

2

ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము.

3

యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?

4

అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.

5

యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.

6

కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.

7

ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశపెట్టుకొనుము యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.

8

ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.

అధ్యాయం 129 అన్ని అధ్యాయాలు అధ్యాయం 131
క్రాస్ రిఫరెన్సులు