Psalms

కీర్తనలు 67

7 వచనాలు 150 అధ్యాయాలలో 67
కీర్తనలు 67 — ఆడియో
అధ్యాయం 67 / 150
కీర్తనలు 67 7 వచనాలు
1

భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును

2

దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.(సెలా.)

3

దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)

4

జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

5

దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.

6

అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.

7

దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.

అధ్యాయం 66 అన్ని అధ్యాయాలు అధ్యాయం 68
క్రాస్ రిఫరెన్సులు