Psalms

కీర్తనలు 54

7 వచనాలు 150 అధ్యాయాలలో 54
కీర్తనలు 54 — ఆడియో
అధ్యాయం 54 / 150
కీర్తనలు 54 7 వచనాలు
1

దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము.

2

దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము.

3

అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయ జూచుచున్నారు వారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా.)

4

ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు

5

నా శత్రువులు చేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము సేచ్చార్పణలైన బలులను నేను నీకర్పించెదను.

6

యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

7

ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.

అధ్యాయం 53 అన్ని అధ్యాయాలు అధ్యాయం 55
క్రాస్ రిఫరెన్సులు