Psalms

కీర్తనలు 121

8 వచనాలు 150 అధ్యాయాలలో 121
కీర్తనలు 121 — ఆడియో
అధ్యాయం 121 / 150
కీర్తనలు 121 8 వచనాలు
1

కొండలతట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?

2

యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.

3

ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.

4

ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు

5

యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.

6

పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.

7

ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును

8

ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును

అధ్యాయం 120 అన్ని అధ్యాయాలు అధ్యాయం 122
క్రాస్ రిఫరెన్సులు