Psalms

కీర్తనలు 124

8 వచనాలు 150 అధ్యాయాలలో 124
కీర్తనలు 124 — ఆడియో
అధ్యాయం 124 / 150
కీర్తనలు 124 8 వచనాలు
1

మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల

2

వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు

3

యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు

4

జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును

5

ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

6

వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.

7

పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొనియున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొనియున్నాము.

8

భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది.

అధ్యాయం 123 అన్ని అధ్యాయాలు అధ్యాయం 125
క్రాస్ రిఫరెన్సులు