Psalms

కీర్తనలు 43

5 వచనాలు 150 అధ్యాయాలలో 43
కీర్తనలు 43 — ఆడియో
అధ్యాయం 43 / 150
కీర్తనలు 43 5 వచనాలు
1

దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యెమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారిచేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.

2

నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి వేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?

3

నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును.

4

అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవునియొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను

5

నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.

అధ్యాయం 42 అన్ని అధ్యాయాలు అధ్యాయం 44
క్రాస్ రిఫరెన్సులు