Psalms

కీర్తనలు 14

7 వచనాలు 150 అధ్యాయాలలో 14
కీర్తనలు 14 — ఆడియో
అధ్యాయం 14 / 150
కీర్తనలు 14 7 వచనాలు
1

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.

2

వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను

3

వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయు వారెవరును లేరు, ఒక్కడైనను లేడు

4

యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు.

5

ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు

6

బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమైయున్నాడు.

7

సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.

అధ్యాయం 13 అన్ని అధ్యాయాలు అధ్యాయం 15
క్రాస్ రిఫరెన్సులు