Psalms

కీర్తనలు 85

13 వచనాలు 150 అధ్యాయాలలో 85
కీర్తనలు 85 — ఆడియో
అధ్యాయం 85 / 150
కీర్తనలు 85 13 వచనాలు
1

యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.

2

నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసియున్నావు (సెలా.)

3

నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొనియున్నావు

4

మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము.

5

ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా?

6

నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా?

7

యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము.

8

దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినిబెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.

9

మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.

10

కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి.

11

భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.

12

యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.

13

నీతి ఆయనకుముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.

అధ్యాయం 84 అన్ని అధ్యాయాలు అధ్యాయం 86
క్రాస్ రిఫరెన్సులు