Psalms

కీర్తనలు 101

8 వచనాలు 150 అధ్యాయాలలో 101
కీర్తనలు 101 — ఆడియో
అధ్యాయం 101 / 150
కీర్తనలు 101 8 వచనాలు
1

నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను యెహోవా, నిన్ను కీర్తించెదను.

2

నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును

3

నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను

4

మూర్ఖచిత్తుడు నాయొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను.

5

తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను

6

నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు.

7

మోసము చేయువాడు నా యింట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులయెదుట నిలువడు.

8

యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.

అధ్యాయం 100 అన్ని అధ్యాయాలు అధ్యాయం 102
క్రాస్ రిఫరెన్సులు