Psalms

కీర్తనలు 112

10 వచనాలు 150 అధ్యాయాలలో 112
కీర్తనలు 112 — ఆడియో
అధ్యాయం 112 / 150
కీర్తనలు 112 10 వచనాలు
1

యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.

2

వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు

3

కలిమియు సంపదయు వాని యింటనుండును వాని నీతి నిత్యము నిలుచును.

4

యథార్థవంతులకు చీకటిలో వెలుగుపుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు.

5

దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును

6

అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.

7

వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.

8

వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు.

9

వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనతనొంది హెచ్చింపబడును.

10

భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.

అధ్యాయం 111 అన్ని అధ్యాయాలు అధ్యాయం 113
క్రాస్ రిఫరెన్సులు