Psalms

కీర్తనలు 56

13 వచనాలు 150 అధ్యాయాలలో 56
కీర్తనలు 56 — ఆడియో
అధ్యాయం 56 / 150
కీర్తనలు 56 13 వచనాలు
1

దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగవలెననియున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు.

2

అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగవలెనని యున్నారు

3

నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.

4

దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?

5

దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి.

6

వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు.

7

తాము చేయు దోషక్రియలచేత వారు తప్పించుకొందురా? దేవా, కోపముచేత జనములను అణగగొట్టుము

8

నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడియున్నవి అవి నీ కవిలెలో1 కనబడును గదా.

9

నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును.

10

దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను

11

నేను దేవునియందు నమ్మికయుంచియున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?

12

దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపువెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.

13

నేను నీకు మ్రొక్కుకొనియున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.

అధ్యాయం 55 అన్ని అధ్యాయాలు అధ్యాయం 57
క్రాస్ రిఫరెన్సులు