Psalms

కీర్తనలు 13

6 వచనాలు 150 అధ్యాయాలలో 13
కీర్తనలు 13 — ఆడియో
అధ్యాయం 13 / 150
కీర్తనలు 13 6 వచనాలు
1

యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?

2

ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించుకొనును?

3

యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము

4

నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.

5

నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.

6

నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.

అధ్యాయం 12 అన్ని అధ్యాయాలు అధ్యాయం 14
క్రాస్ రిఫరెన్సులు